5 లక్షలతో మొదలైన విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఇప్పుడు ఎంత.. ?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తెలుగు సినిమా పరిశ్రమలో యవ కెరటం.

ఆయన మాట తీరు, నటన, చేసే సినిమాలు అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి.

తను నటించే సినిమాలు సైతం చాలా వైవిధ్యంలో కూడుకుని ఉంటాయి.

టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు విజయ్ చాలా కష్టపడ్డాడు.అవకాశాల కోసం ఎంతో ఎదురు చూశాడు.

కానీ తను చేసిన సినిమాలు ఓ రేంజిలో హిట్ కావడంతో వెనుతిరిగి చూసుకోలేదు.చేసింది తక్కువ సినిమాలే అయినా నటుడిగా మస్త్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

Advertisement
Hero Vijay Devarakonda Remunerations From First To Last Movie, Vijay Devarakonda

పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టిన విజయ్.అర్జును రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.

అయితే తన తొలి సినిమాకు 5 ల‌క్ష‌ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్.ప్రస్తుతం కోట్లల్లో తీసుకుంటున్నాడు.

ఇంతకీ తను నటించిన ఏ సినిమాకు ఎన్నికోట్ల రూపాయలు తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

*పెళ్లిచూపులు – 5 ల‌క్ష‌లు

Hero Vijay Devarakonda Remunerations From First To Last Movie, Vijay Devarakonda

విజయ్ హీరోగా చేసిన తొలి సినిమా ఇదే.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిన్న బ‌డ్జెట్ సినిమాగా తెరకెక్కింది.ఈ సినిమాకు తను రూ.5 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు.తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టడంతో చాలా అవకాశాలు వచ్చాయి.

*ద్వారక – 20 ల‌క్ష‌లు

Hero Vijay Devarakonda Remunerations From First To Last Movie, Vijay Devarakonda
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
బాలీవుడ్ హీరోతో సినిమాకి కమిట్ అవ్వనున్న ప్రశాంత్ వర్మ..

డిఫరెండ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

*అర్జున్ రెడ్డి- 5 ల‌క్ష‌లు

Advertisement

ఈ సినిమాను ముందుగా ఒప్పుకోవడం వల్ల రెమ్యునరేషన్ పెంచలేదు.లాభాల్లో మాత్రం విజయ్ వాటా తీసుకున్నాడు.

*గీతా గోవిందం – 5 ల‌క్ష‌లు

ఈ సినిమా కూడా ముందే ఒప్పుకోవడంతో రెమ్యునరేషన్ అంతే ఉంది.చిన్న బడ్జెట్ సినిమా అయినా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది ఈ సినిమా.

*నోటా – 3 కోట్లు

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగ భాషల్లో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు విజయ్ రూ.3 కోట్లు తీసుకున్నాడు.అయినా ఈ సినిమా పెద్ద హిట్టేంకాలేదు.

*టాక్సీవాలా – 5 కోట్లు

రాహుల్ ద‌ర్శ‌కత్వంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.

*డియ‌ర్ కామ్రెడ్ – 10 కోట్లు

భ‌ర‌త్ డైరెక్ష‌న్ లో వచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

*వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ – 10 కోట్లు

ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

*లైగర్ – 12 కోట్లు

పూరీ జ‌గ‌న్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న తాజా మూవీ లైగర్.ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు