సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత అభిమానులు వారి ఇష్టమైన అభిమానుల సినిమా విషయంలో ఎంతో ఆసక్తి చూపిస్తూ వారి అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేస్తున్నారు.సినిమా బాగుంది అంటే బాగుందని లేకపోతే బాలేదంటూ ఏ విషయాన్ని తడబడకుండా చెప్పేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ హీరోల నిర్ణయాలను కూడా కొన్నిసార్లు వ్యతిరేకిస్తూ ఉంటారు అయితే తాజాగా హీరో నితిన్ విషయంలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.నితిన్( Nithin ) మార్చి 30 తేదీ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలోని వక్కంతం వంశీ ( Vakkantham Vamsi )సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ చర్చలకు రావడమే కాకుండా వంశీ నితిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వక్కంతం వంశీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…కొన్ని బంధాలను మాటల్లో చెప్పలేం అలాంటి బంధమే మనది హ్యాపీ బర్త్డే నితిన్ అంటూ వక్కంతం వంశీ పుట్టినరోజు( Birthday ) శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధంగా మనం ఎలాంటి సినిమా చేస్తున్నామో ఆడియన్స్ కు చూపించాలని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ సినిమా గురించి మాట్లాడారు.ఇక వంశీ చేసిన ట్వీట్ కి నితిన్ రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ డార్లింగ్ మన కంటెంట్ డిలే అయిన ఇంపాక్ట్ డబుల్ ఉంటుంది.
అందరికీ సారీ కాస్త ఓపిక పట్టండి ఈసారి మాత్రం డిసప్పాయింట్ చేయను లవ్ యు ఆల్ అంటూ నితిన్ రిప్లై ఇచ్చారు.

పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిజంగానే ఇది డిసప్పాయింట్ అని చెప్పాలి.అయితే ఈ విషయంపై ఒక అభిమాని స్పందిస్తూ ఆల్రెడీ మేము డిసప్పాయింట్ అయ్యాములే అన్న… చాలా థాంక్స్ అన్న బర్త్ డే బాగా గుర్తుండేలా చేశారు అంటూ ట్వీట్ చేశారు.అయితే నెటిజన్ చేసిన ట్వీట్ కి నితిన్ స్పందిస్తూ ఈ సినిమా మీ అందరికీ ఇంకా బాగా గుర్తుండిపోయేలా… మీ అందరికీ తెగ నచ్చేలా చేస్తా తమ్ముడు అంటూ చాలా కూల్ గా రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం వీరి సంభాషణకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
