బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో కరణ్ జోహార్ (Karan Johar) ఒకరు.ఈయన బాలీవుడ్ సెలెబ్రెటీలకు ఎప్పుడు పార్టీలు ఇస్తూ ప్రతీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
ఇక ఈయన బడా ప్రాజెక్టులను నిర్మిస్తూనే మరో వైపు ఒక షోకు హోస్ట్ గా కూడా చేస్తున్నాడు.ఈయన ఎప్పటి నుండో చేస్తున్న సెలెబ్రిటీ టాక్ షో ”కాఫీ విత్ కరణ్”(Koffee With Karan) .ఈ షో బాలీవుడ్ లో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఈ షోలో ప్రముఖ సెలెబ్రిటీలతో కరణ్ చేసే సందడితో ఈ షో సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పటికే ఎంతో మంది పాల్గొన్న ఈ టాక్ షో 7 సీజన్స్ ను పూర్తి చేసుకుని 8వ సీజన్ (Koffee With Karan Season 8) లోకి అడుగు పెట్టబోతోంది.మరి ఈసారి ఈ టాక్ షోలో మన సౌత్ స్టార్స్ కూడా సందడి చేయబోతున్నారు అంటూ తాజాగా ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.
కాఫీ విత్ కరణ్ సీజన్ 8 అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.
ఆగస్టులో కానీ సెప్టెంబర్ లో కానీ ఈ షో స్టార్ట్ అవుతుంది అని ప్రచారం జరుగుతుంది.ఇదిలా ఉండగా ఈసారి కరణ్ షోకు గెస్టులుగా సౌత్ స్టార్స్ రాబోతున్నారట.అది కూడా ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్స్ ఈ షోలో సందడి చేయబోతున్నారు.
మరి ఆ ముగ్గురు స్టార్స్ ఎవరంటే.ఒకటి మన తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాగా.
మరో ఇద్దరు యష్, రిషబ్ శెట్టి అని తెలుస్తుంది.అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకుని బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ లేకుండానే 100 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసాడు.ఇక యష్ (Yash) కేజిఎఫ్ సిరీస్ తో అలరించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకోగా.రిషబ్ శెట్టి (Rishab Shetty)కాంతారా సినిమాతో ఆకట్టుకున్నాడు.మరి ఈ ముగ్గురు నార్త్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించు కున్నారు.చూడాలి మరి ఈ వార్తలో నిజమెంతో.