ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’కు విశేష ఆదరణ..

సంగీతానికి ఎల్లలు లేని ఒక ప్రపంచ స్థాయి భాష.అదే నేడు తెలుగు ఇండియన్ ఐడల్ అనే విశ్వవేదికపై యువ గాయకులు తమ ప్రతిభను చాటేందుకు దోహదపడుతోంది.

 Telugu Indian Idol 2 Which Is Being Streamed On Aha Is Very Popular-TeluguStop.com

తెలుగుపాట ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారి చెవికి చేరుతోంది.షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నాు.

సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు.

పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని ‘ఎంకిమీడ నా జతవిడి…’ సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు.

సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు.ఆ చిత్రంలో ఒరిజినల్ పాటను ఆమె శ్రేయానే ఆలపించారు.

అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని మరియు హిమేష్ రేషిమియా షో కు వస్తున్న ఆదరణను ప్రశంసించారు.ఈ షో ఇలాగే దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించి, కంటెస్టెంట్స్ కు అల్ ది బెస్ట్ చెప్పారు.

షో గురించి ఆహా మార్కెటింగ్ హెడ్ కార్తీక్ కనుమూరు మాట్లాడుతూ ” తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ తమ గాత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందండం చాలా సంతోషంగా ఉంది.ఆహా ఓటీటీ ఈ షో ద్వారా ప్రతిభావంతులైన గాయకులను ప్రపంచానికి పరిచయం చేయడంలో విజయవంతమౌతుంది.

రానున్న రోజుల్లో ఈ షో ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు తెలుగు సంగీత ప్రపంచంలో తమ స్థానాన్ని సుస్ధిరపరుచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదని సగర్వంగా చెప్పుకొచ్చారు.తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం ప్రతి శక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube