బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( BRS MLC Kavitha )పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు కవిత పిటిషన్ ను జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ( Justice Bela M Trivedi, Justice Pankaj Mittal )ధర్మాసనం విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను కవిత అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ లో సుప్రీంకోర్టును( Supreme Court ) కోరారు.అయితే ఏడాది కాలంగా కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.
దీంతో ఈడీ విచారణకు కవిత గైర్హాజరు అవుతున్నారు.ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ అనంతరం కవిత పిటిషన్ పై క్లారిటీ రానుంది.