BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( BRS MLC Kavitha )పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఈ మేరకు కవిత పిటిషన్ ను జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ( Justice Bela M Trivedi, Justice Pankaj Mittal )ధర్మాసనం విచారించనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను కవిత అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ లో సుప్రీంకోర్టును( Supreme Court ) కోరారు.

అయితే ఏడాది కాలంగా కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.దీంతో ఈడీ విచారణకు కవిత గైర్హాజరు అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ అనంతరం కవిత పిటిషన్ పై క్లారిటీ రానుంది.

‘డుగ్గు డుగ్గు బుల్లెట్’ అంటూ హల్చల్ చేస్తోన్న వెన్నెల జయతి (వీడియో)