ఇంగువ, బెల్లం. వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.
ప్రత్యేకమైన రుచి కలిగి ఉండే ఈ రెండిటిలోనూ ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎన్నో జబ్బులను సైతం నివారిస్తాయి.అయితే విడి విడిగానే కాదు.
ఈ రెండిటిని కలిపి తీసుకున్నా బోలెడన్ని ఆరోగ్య లాభాలను పొందొచ్చు.మరి ఇంగువ, బెల్లంను కలిపి ఎలా తీసుకోవాలి.? ఎప్పుడు తీసుకోవాలి.? అసలు వీటని కలిపి తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటీ.? అన్న విషయాలు లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక బౌల్‌లో అర స్పూన్ ఇంగువ, ఒక స్పూన్ బెల్లం తురుము, పావు స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకుని ఉండలా చేసుకోవాలి.
ఈ ఉండని ఉదయాన్నే తీసుకోవాలి.ప్రతి రోజు ఇలా చేస్తే గనుక శ్వాస సంబంధిత వ్యాధులన్నీ పరార్ అవుతాయి.ముఖ్యంగా కఫం, శ్వస కోశలో అడ్డంకులు, ఛాతి పట్టేసినట్టు ఉండటం వంటివి దూరం అవుతాయి.
అలాగే ఇలా బెల్లాన్ని, ఇంగువని కలిపి తీసుకోవడం వల్ల రక్త పోటు స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.
రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.ఒత్తిడి, తల నొప్పి, డిప్రెషన్ వంటివి దరి చేరకుండా ఉంటాయి.
ఇక సంతాలన సమస్యలతో బాధ పడే దంపతులు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో పావు స్పూన్ ఇంగువ, ఒక స్పూన్ బెల్లం పొడి కలిపి సేవించాలి.
రెగ్యులర్‌గా ఇలా తీసుకుంటే స్త్రీ, పురుషుల్లో లైంగిక సమస్యలు తగ్గి.సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.మరియు స్త్రీలలో ఏవైనా అండాశయ సమస్యలు ఉన్నా తగ్గుతాయి.