అటు ఇటు రోడ్డు వేసి అర కి.మీ.వదిలేశారు

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్- కమలానగర్ మధ్య గుంతలు పడిన రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాంతినగర్- కమలానగర్ మధ్య అర కిలోమీటర్ దూరంలో 60 గుంతలతో ప్రయాణికులు, ద్విచక్ర,ఇతరవాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

గతంలో మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ ఇవతల వరకు రోడ్డు వేశారని,అటు దాచారం నుండి కమలానగర్ ఊరు అవతల వరకు రోడ్డు వేశారని,ఈ రెండు ఊర్ల మధ్య మిగిలిన దూరం అర కిలోమీటరు రోడ్డును మాత్రం ఇటు మున్సిపల్ పరిధిలో,అటు మండల పరిధిలో ఎవరూ పట్టించుకోకపోవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.ఈ రోడ్డులో నేరేడుచర్ల-దాచారం వరకు నిత్యం వ్యవసాయ కూలీలు,కార్మికులు వారి వారి పనుల నిమిత్తం ప్రయాణిస్తుంటారు.

ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి,వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.

Advertisement

Latest Suryapet News