వరద ఉధృతి ప్రాంతాలను పరిశీలించిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా : గత రెండు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు లోనికి ఎగువ నుండి భారీగా వరదనీరు చేరడంతో మత్తడి దూకి మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , ఏఎస్పి శేషాద్రిని రెడ్డి తో కలసి వరద ఉధృతిని పర్యవేక్షించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కరెంటు స్థంభాలను, వైర్లను, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు.

చెరువులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్ళద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు నుంచే ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.వరద ఉధృతిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

వరద ఉధృతి కారణంగా నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.

Advertisement
భారీ వర్షానికి పొంగుతున్న వాగులు వంకలు

Latest Rajanna Sircilla News