బిగ్ బాస్ షో తెలుగు సీజన్1 కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హోస్ట్ గా వ్యవహరించారు.ఈ షో హిట్ కావడంలో తారక్ పాత్ర ఎంతో ఉందనే సంగతి తెలిసిందే.
అయితే తర్వాత రోజుల్లో తారక్ కు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించే అవకాశం దక్కినా తారక్ మాత్రం ఆ అవకాశాన్ని వదులుకున్నారు.అయితే బిగ్ బాస్ షో సీజన్8( Bigg Boss 8 ) లో తారక్ గెస్ట్ గా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
దేవర సినిమా( Devara ) ప్రమోషన్స్ లో భాగంగా తారక్ ఈ షోకు హాజరయ్యే ఛాన్స్ అయితే ఉంది.సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని( Nani ) ఈ షోలో కనిపిస్తున్నట్టు తాజాగా విడుదలైన ప్రోమోతో అర్థమైంది.
బిగ్ బాస్ షో నిర్వాహకులతో కూడా తారక్ కు సత్సంబంధాలు ఉన్నాయి.తారక్ ఈ షోకు గెస్ట్ గా హాజరైతే కూడా రేటింగ్స్ పరంగా అదరగొట్టడం పక్కా అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.ఈ సినిమాలో ఒక పాత్రలో నార్మల్ లుక్ లో, మరో పాత్రలో రింగుల జుట్టులో కనిపించనున్నారు.తారక్ ఈ సినిమా రోల్ కోసం పడిన కష్టం మాత్రం మామూలు కష్టం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ వయస్సు పెరుగుతున్నా యంగ్ లుక్స్ లో కనిపిస్తూ అదిరిపోయే లుక్స్ లో కనిపిస్తుండటం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తను హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం అదిరిపోయాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.తారక్ రెమ్యునరేషన్ కూడా హై రేంజ్ లో ఉండటం గమనార్హం.బిగ్ బాస్ షోలో తారక్ భవిష్యత్తు సినిమాలకు సంబంధించిన శుభవార్తలు సైతం చెబుతారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.