అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత,బీసీ, మైనార్టీ బంధు,గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని, అధికారం పార్టీ నేతలు తప్పుడు ఆలోచనను మానుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్( Elguri Govind ), మేకనబోయిన శేఖర్ హితవు పలికారు.

గురువారం జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ వన్ టౌన్,త్రీ టౌన్,సూర్యాపేట రూరల్ కమిటీల ఆధ్వర్యంలో సూర్యాపేట తాహాసిల్దార్ కార్యాలయం ముందు అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు మొత్తం బీఆర్ఎస్( BRS ) కార్యకర్తలకు వర్తింపజేసే విధానాన్ని మార్చుకొని,అర్హులైన పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.గతంలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వస్తే గ్రామంలోని అన్ని పార్టీల పెద్దలందరూ కూర్చొని అర్హులైన నిరుపేదలను గుర్తించి వర్తింపజేసే వారిని,కానీ, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Government Schemes Should Be Given To All The Deserving Poor , Deserving Poor ,

నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తూ,బీఆర్ఎస్ పార్టీలో ఆర్ధికంగా స్థిరపడినవారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ఆరోపించారు.పార్టీలో చేరిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అనడం అర్థం లేదన్నారు.

అందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దళితులు,బీసీలు, మైనార్టీలు,పేదలు, అందరిని కలుపుకొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అర్హులైన పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను దొడ్డి దారిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే హక్కు ఎవరు కల్పించాలని ప్రశ్నించారు.

Advertisement

అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాహాసిల్దార్ కు సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు మేకనబోయిన సైదమ్మ, నాయకులు వల్లపుదాసు సా.

Advertisement

Latest Suryapet News