విద్యుత్ షాక్ తో గడ్డిపల్లి సబ్ స్టేషన్ ఆపరేటర్ మృతి

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామ పరిధిలోని తెలిసిన వ్యక్తి వ్యవసాయ పొలంలో ఆదివారం స్తంభాలకు విద్యుత్ తీగలు లాగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై గరిడేపల్లి మండలం గడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పని చేస్తున్న తాళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన మండవ నాగేశ్వరరావు(40) అక్కడికక్కడే మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చెప్పులు వేసుకోకపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువై స్పాట్ డెడ్ జరిగినట్లు తెలుస్తుంది.

మృతుడు ప్రస్తుతం నేరేడుచర్ల పట్టణంలో నివసిస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Gaddipally Sub Station Operator Died Due To Electric Shock , Gaddipally Sub Stat

Latest Suryapet News