సింగారెడ్డిపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

దేశవ్యాప్తంగా జాతీయ ఐఎంఏ ఆదేశానుసారము ఆదివారం ఆవో గావో ఛలో (పల్లెకు పోదాం పద)( Aao Gaon Chalo ) కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలు,తండాలు మరియు వార్డులను ఐఎంఏ సభ్యత్వం కలిగిన వైద్యులు దత్తత తీసుకోవడం జరిగిందని ఐఎంఏ వైద్యులు( IMA Doctors ) తెలిపారు.

దత్తత గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయు కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం గ్రామం( Singareddy Palem )లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలు విభాగాల వైద్య నిపుణులు సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.

అలాగే సీజనల్ వ్యాధులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిజేసి, వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బి.ఎం.చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ ఆనంద్, డాక్టర్ ప్రశాంతి,డాక్టర్ రమేష్ నాయక్,డాక్టర్ విద్యాసాగర్,డాక్టర్ విజయలక్ష్మి,డాక్టర్ రామకృష్ణ,డాక్టర్ శ్రీరామ్ కుమార్,డాక్టర్ సాదన్ కుమార్,డాక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్26, గురువారం 2024

Latest Suryapet News