ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాజన్న సిరిసిల్ల జిల్లా : నంగునుర్ ప్రతిమ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సోమవారం జరిగే ఉచిత మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేయాలని మాజీ ఎంపీటీసీ ,ప్రతిమ మెడికల్ కళాశాల మండల ఆర్గనైజర్ ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు తో ఆదివారం సమావేశం నిర్వహించారు.

గ్రామంలో దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని రేపు ప్రతిమ మెడికల్ కళాశాల బస్ ద్వారా తీసుకెళ్ళి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని ఇట్టి శిబిరం సక్సెస్ చేయాలని ఒగ్గు బాలరాజు యాదవ్ ఆశా వర్కర్లు ను కోరారు.

మెడికల్ కళాశాల వారి బస్ ఉదయం ఎనిమిది గంటలకు వస్తుందని ఆయన అన్నారు.ఇట్టి వైద్య శిబిరం లో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరం ఉంటే వారికి ఉచిత ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని అన్నారు.

ఈ సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి స్రవంతి ఉన్నారు.

1500 సార్లు ప్రసారమైన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ... అంత క్రేజ్ ఉన్న సినిమా ఏంటో తెలుసా?
Advertisement

Latest Rajanna Sircilla News