మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు కానీ, కమీషన్ల దందాలు ఎక్కువైనయని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ 15 నెలల పాలనలో ఏ కాంట్రాక్టర్ కు ఎన్ని నిధులు విడుదల చేశారో దమ్ముంటే బయటపెట్టండని సవాల్ విసిరారు.

కమీషన్లకు కక్కుర్తిపడి బడా కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులు దోచిపెట్టారని,లోటు బడ్జెట్ లో ఉండి కూడా కాంట్రాక్టర్ల జేబులు నింపారని,తద్వారా మంత్రుల జేబులూ నింపుకున్నారన్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు.

Former Minister And Suryapet MLA Jagadish Reddy Comments, Former Minister MLA Ja

మంత్రులు పోటీలు పడి మరీ ఫోటోలకు ఫోజులివ్వడం తప్పా పనులు అడుగు ముందుకు పడలేదన్నారు.

ఇంటి పెరటిలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
Advertisement

Latest Suryapet News