మాజీలైనా కాంగ్రెస్ సర్పంచులను వేధిస్తున్న ఐదేళ్ల పాలన...!

నల్లగొండ జిల్లా:దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అనేది మన పెద్దలు చెప్పిన మాట.అలాంటి పల్లెలలో పాలన చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.

ఒకప్పుడు గ్రామ సర్పంచ్ అంటే ఒక గౌరవం ఉండేది.వ్యక్తిని,వ్యక్తిత్వాన్ని చూసి ప్రజలు సర్పంచ్ కు ఓటేసేవారు.

లేదా ఏకగ్రీవంగా ఎన్నుకొనేవారు.ఎన్నికైన వారు కూడా ప్రజా సేవ చేస్తూ పరిపాలన అందించే వారు.

ఇదంతా ఒకప్పుడు.ఇప్పుడు రాజకీయాలు మారాయి.

Advertisement

ఓటుకు నోటు లేకుండా వార్డు మెంబర్ కూడా అయ్యే అవకాశం లేకుండా పోయింది.ఒక సర్పంచ్ అభ్యర్థి సుమారు 10 లక్షల నుండి 3 కోట్ల వరకు పెట్టకపోతే సర్పంచ్ పదవి దక్కేలాలేదు.

పక్కా కమర్షియల్ గా మారిన సర్పంచ్ రాజకీయాలలో అనేక ఇబ్బందులు పడి పైసలు పెట్టి సర్పంచ్ లుగా గెలిచిన వారికి గత ఐదేళ్ల కాలం పీడ కలగానే మిగిలిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచుల పరిస్థితి మరీ దారుణంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఉన్నన్ని రోజులు అధికార బీఆర్ఎస్ నుండి నిధులు రాక,ఏం చేయాలన్నా పైన ఉన్న వారి అనుమతులు తీసుకోలేక,ఏదైనా చేయాలంటే గ్రామాల్లో అధికార పార్టీ నేతల అభ్యంతరాలు,అధికారుల నిరాకరణ వెరసి కాంగ్రెస్ సర్పంచులకు ఐదేళ్లు పట్టపగలే చుక్కలు కనిపించాయని చెప్పక తప్పదు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు ఏ మాత్రం విలువ లేకుండా పోయిందని పలువురు సర్పంచులు అప్పట్లోనే గగ్గోలుపెట్టారు.

గ్రామ శాఖా గులాబీ దళపతి అన్ని తానై చేయడంతో కాంగ్రెస్ సర్పంచులు కాగితాలకే పరిమితమైపోయారు.గ్రామానికి సంబంధించిన అభివృద్ధి చేయలేక,పేరు లేక,పెట్టిన పైసలు రాక, ప్రజల సమస్యలు తీర్చలేక,గ్రామ పంచాయితీలు అవసరాలను తీర్చడం కోసం అప్పులు చేసి చిన్న చిన్న పనులు చేస్తే వాటికి బిల్లులు రాక,ఎవరికి చెప్పుకోలేక,ఆర్ధిక,మానసిక,రాజకీయ ఒత్తిళ్లు భరించలేక కొందరు బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
ఫేర్‌వెల్‌లో నవ్వుతూ మాట్లాడుతూనే కుప్పకూలిన స్టూడెంట్.. సెకన్లలో విషాదం.. లైవ్ వీడియో వైరల్!

అప్పటికైనా తమ బాధలు గట్టెక్కే పరిస్థితి ఉందని భావించిన కొద్ది రోజులకే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి అనూహ్యంగా కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దీనితో గులాబీ పార్టీలోకి వెళ్ళిన కాంగ్రెస్ సర్పంచ్ లు ఘర్ వాపస్ అయ్యారు.

Advertisement

కానీ,ఈ లోపే వారి పదవీ కాలం ముగియడంతో అంతా నిరాశా,నిస్పృహలకు లోనై మానసిక,ఆర్ధిక పరమైన వేదనతో ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా వెక్కివెక్కి ఏడవడం మినహా చేసేదేమీ లేకపాయే.నిజంగా గడిచిన ఐదేళ్ల కాలం కాంగ్రెస్ తరుపున గెలిచిన సర్పంచులకు ఏ విధంగా కలసి రాలేదని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాలేదని ఉమ్మడి నల్లగొండకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు( Congress Sarpanch Muthineni Koteswara Rao ) అంటున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తరుపున సర్పంచ్ గా గెలిచి గ్రామ అభివృద్ధి కొరకు నిధులు ఖర్చు చేయడం జరిగింది.

సర్పంచ్ పదవిలో ఉండి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులతో కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పదవీకాలం ముగియడంతో నిధులు కూడా మంజూరు కాకపోవడం,ప్రజలకు సేవ చేసే సమయంలో దిగిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Nalgonda News