మూసి వాగులో మత్స్యకారుడి మృతి

సూర్యాపేట జిల్లా:మూసీ నదిలోకి చేపల వేట వెళ్లిన ఓ నిరుపేద మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన వీర్ల పిచ్చయ్య (35) అనే మత్స్యకారుడు శుక్రవారం ఉదయం మూసీ వాగులోకి చేపల వేటకు వెళ్ళాడు.

తెప్పపై చేపల వేట చేస్తున్న పిచ్చయ్య ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు.ప్రమాదాన్ని గమనించిన తోటి మత్స్యకారులు పిచ్చయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టి,చివరికి అతని మృతదేహాన్ని బయటికి తీశారు.

Fisherman Killed In Closed River-మూసి వాగులో మత్స్

మృతుడు పిచ్చయ్యకు భార్య,ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని అత్యంత నీరుపేద కుటుంబానికి చెందిన పిచ్చయ్య మరణంతో భార్య పిల్లలు దిక్కులేని వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతిని దహన సంస్కారాలకు కూడా స్తోమత లేని కారణంగా ముదిరాజ్ సంఘం తరఫున మానవతా దృక్పథంతో ఆయన కుటుంబానికి తోచినంత ఆర్థిక సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

మానవత్వం ఉన్న మనుషులెవరైనా సరే ఈ నెంబర్ ద్వారా 9666068051 ఫోన్ పే ,గూగుల్ పే చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News