ఎంత సంపాదించిన ఆర్ధిక ఇబ్బందులు వస్తున్నాయా.. అయితే దోషం ఉన్నట్టే!

కొందరి ఇంట్లో అందరూ సంపాదిస్తున్నప్పటికీ ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు.వచ్చిన డబ్బు వృథా అవుతుంది.

ఇంట్లో ఖర్చులు తగ్గించి డబ్బు ఆదా చేయాలని ఎంత ప్రయత్నించినా డబ్బు మిగలదు.అలా జరగడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు.

Financial Problems In Your Home Please Follow This Income, Vasthu Proble, Hindu

మనం నివసిస్తున్న ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో అన్న అనుమానాలు వస్తుంటాయి.మన ఇంట్లో వాస్తు ప్రకారం వస్తువులు ఉన్నట్లయితే మన ఇంట్లో డబ్బుని ఆదా చేసుకోవచ్చు.

వాస్తు ప్రకారం వస్తువులు ఎక్కడ ఉండాలో తెలుసుకుందాం.మన ఇంటి దక్షిణ భాగంలో కుబేరుడు కొలువై ఉంటారని మనం నమ్ముతాము.

Advertisement

అలాంటి దక్షిణ భాగాన చెప్పులు, చీపురు వంటి వాటిని వేయటం వల్ల మన ఇంట్లో లక్ష్మి దేవి నిలబడదు.మన ఇంటి ముఖద్వారం ఎప్పుడూ అందంగా, ఆహ్లాదంగా ఉండాలి.

ఇంటి ప్రధాన ద్వారం తలుపులు అందంగా ఉండడం వల్ల మన ఇంట్లో డబ్బు ఆదా చేసుకోవచ్చు.ఒకవేళ తలుపులు విరిగిపోయి ఉంటే వాటిని వెంటనే మరమ్మతు చేయించాలి.

అలా విరిగిపోయిన తలుపులు ఉండడం వల్ల కూడా ఇంట్లో డబ్బులు మిగలవు.అంతేకాకుండా గుమ్మానికి ఎటువైపు చెట్లను పెంచడం ఎంతో మంచిది.

మన ఇంట్లో డబ్బులు దాచే టప్పుడు ఎప్పుడూ కూడా నైరుతి దిశలో విలువైన ఆభరణాలు, ఆస్తి పత్రాలు, డబ్బులు పెట్టడం వల్ల మన సంపద దినదినాభివృద్ధి జరుగుతుంది.అంతేకాకుండా పడమర లేక దక్షిణ దిశలో పెట్టడం వల్ల అనవసరంగా ఖర్చులు అధికమవుతాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

మన ఇంట్లో ఈశాన్య దిక్కులో నీటిని అంటే ఆక్వేరియం లేదా మనం త్రాగే నీరు ని అక్కడ పెట్టుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.ఆ నీటిని తరచుగా మారుస్తూ మురికిగా లేకుండా చూసుకోవాలి.

Advertisement

ఇలా పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందవచ్చు.అంతేకాకుండా మన ఇంట్లో ఎక్కడైనా లీకేజ్ ప్రాబ్లం ఉంటే డబ్బులు కూడా అలాగే వృధా ఖర్చు అవుతుంది.

అలాంటి లీకేజీలనువెంటనే మరమ్మతు చేయించడం ఎంతో మంచివి.ఇలాంటి చిన్న చిన్నవాస్తు పద్ధతులు పాటించడం ద్వారా మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి ఆర్థికంగా ఎదుగుతారు.

తాజా వార్తలు