రైతులు అప్రమత్తంగా ఉండాలి:అసిస్టెంట్ రిజిస్టర్ ఇందిరా

సూర్యాపేట జిల్లా:కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాలని అసిస్టెంట్ రిజిస్టర్ ఇందిరా అన్నారు.

బుధవారం కోదాడలోని తమ్మర వద్ద కోదాడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ఆవుల రామారావుతో కలిసి ఆమె పరిశీలించి మాట్లాడారు.

రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు.చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉంటూ టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం వెంటనే నగదు జమ చేస్తున్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ధాన్యంతో పాటు అన్ని రకాల ధ్రువపత్రాలు వెంట తీసుకొని రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ చాంద్ బి,సొసైటీ సిబ్బంది,రైతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025

Latest Suryapet News