తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఇద్దరు నేతలకు చోటు దక్కనుందని సమాచారం.ఈటల రాజేందర్ ఉద్వాసనతో ఓ స్థానం ఇప్పటికే ఖాళీగా ఉండగా మరో మంత్రికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆ స్థానాలను భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈటల స్థానంలో మాజీమంత్రి మహేందర్ రెడ్డికి చోటు కల్పించనున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు రేపు రాజ్ భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.