ఆదర్శ మున్సిపాలిటీలో అంతా అస్తవ్యస్తం...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ( Suryapet Municipality )కి ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయి.

పేరుకు ఆదర్శ మున్సిపాలిటీ కానీ,పేటలో పేరుకుపోయిన అపరిశుభ్రతతో అంతులేని దోమల బెడద పట్టణ వాసులను వేధిస్తుంది.

జిల్లా కేంద్రంతో పాటు ఇటీవలి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది.ఎక్కడికక్కడ డ్రైనేజీ వ్యవస్థ( Drainage system ) అస్తవ్యస్తంగా యుతయారై మురుగు నీరు నిల్వ ఉండడంతో సాయంత్రం ఏడైతే చాలు దోమల( Mosquitoes ) మోతతో బెంబేలెత్తిపోతున్నారు.

దోమకాటు వల్ల వైరల్ ఫీవర్స్ వస్తుండటంతో జనం హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు.కనీసం ఐదారు రోజులపాటు హాస్పిటల్లో ఉండాల్సి రావడంతో ఆర్ధికంగా భారమై ఇబ్బందులు పడుతున్నారు.

దురాజ్ పల్లి, రాయనిగూడెం, పిల్లలమర్రి,దాసాయిగూడెం గ్రామాలను మున్సిపాల్టీలో విలీనం చేసి,వాటి నిర్వహణ మాత్రం మర్చిపోయారని, కొన్ని వార్డుల్లో కౌన్సిలర్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి దోమల నివారణకు సరైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ను వివరణ కోరగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని,విలీన గ్రామాల్లో కూడా చెత్త సేకరణ చేపడుతున్నామని, డ్రైనేజీల్లో చెత్త నిలువ లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

Advertisement

Latest Suryapet News