క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ పాటుపడాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: అంతర్జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి.

అనంతరం అవగాహన ర్యాలీ నీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అరుణ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమము చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ కేంద్రాల్లో ప్రతి రోజు రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి మొదలైన లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారిని గుర్తించి, వారికి వ్యాధి నిర్దారణ అయితే చికిత్స అందించడం జరుగుతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో, క్షయ వ్యాధి రహిత రాష్ట్రంగా ఉండడానికి ఎన్నో రకాల కార్యక్రమాలను, ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు.క్షయ వ్యాధిని గుర్తించుటకై జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సి.బి.నాట్ యంత్రాన్ని మరియు వేములవాడ, ఎల్లారెడ్డిపెట్ హాస్పిటల్లో రెండు ట్రూనాట్ వంటి అధునాతన యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

జిల్లా వ్యాప్తంగా 8 మైక్రోస్కోప్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఎవరికైన వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు వెళ్ళాలని అన్నారు.తద్వారా వ్యాధి మొదటి స్థాయిలోనే గుర్తించి దానికి సరైన వైద్యాన్ని అందించడం జరుగుతుందన్నారు.

Advertisement

దీని ద్వారా వేరే వారికి సోకే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ సుమన్ మోహన్ రావు, హాస్పిటల్ పర్యవేక్షకులు మురళీధర్ రావు, డాక్టర్లు, ఆశలు, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

Latest Rajanna Sircilla News