ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలి: అదనపు ఎస్పీ

సూర్యాపేట జిల్లా: ఈ నెల 30 న జరుగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లా అదనపు ఎస్పీ,ఎన్నికల నోడల్ అధికారి మేక నాగేశ్వరరావు అధ్వర్యంలో కేంద్ర బలగాలతో పోలీసులు సోమవారం పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ముందస్తు చర్యలలో భాగంగా పట్టణంలోని ఇందిరా సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు జిల్లా పోలీస్ సిబ్బంది,పారా మిలిటరీ సిబ్బంది పోలీసు కవాతుని నిర్వహించినట్లు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

పౌరులు ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాలని,ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినా,గొడవలు సృష్టించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో కోదాడ డిఎస్పీ ప్రకాష్ జాదవ్,సిఐ రామలింగారెడ్డి, నియోజకవర్గ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News