పెన్షన్ కోసం పెద్దాయన ఎదురుచూపులు...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం వసంతపురం ఆవాసమైన తెల్లబండతండ గ్రామానికి చెందిన గుగులోతు పాప అనే 73 ఏళ్ల వృద్ధుడికి ఆసరా పెన్షన్ లో భాగంగా వృద్ధాప్య పెన్షన్ ( Old age pension )అందడంలేదని బాధిత వృద్దుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పలుమార్లు గ్రామపంచాయతీ,మండల కార్యాలయం నందు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నా పదే పదే తిరస్కరిస్తున్నారన్నారు.

తాను అధికార పార్టీ కాకపోవడం,అధికారులకు లంచం ఇవ్వకపోవడం వల్లే కావాలనే పెన్షన్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.కంటిచూపు మందగించి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు,సూర్యాపేట జిల్లా ఏర్పడ్డ తర్వాత రెండుసార్లు సదరన్ క్యాంపులకు వెళ్ళినా మధ్య దళారులు డబ్బులు ఇవ్వలేదని ఆయనకు చూపు సరిగానే ఉందని, సర్టిఫికెట్ రాకుండా రిజెక్ట్ చేశారని వాపోయారు.

Elderly Waiting For Pension , Pension-పెన్షన్ కోసం పె�

నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు అయినా వృద్ధాప్య పెన్షన్ రాకపోవడంతో ఇంట్లో ఖర్చులు పెరిగి,సమస్యలు ఎక్కువై ఇబ్బంది పడుతున్నానని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నాకు పెన్షన్ వచ్చే విధంగా చూడాలని వేడుకున్నారు.

కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ
Advertisement

Latest Suryapet News