ఆరోగ్యానికి మేల‌‌ని జీల‌క‌ర్ర అతిగా తింటున్నారా.. అయితే రిస్క్ త‌ప్ప‌దు!

జీల‌క‌ర్ర‌ దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ప్రాచీన కాలం నుండి వంట‌ల్లో విరి విరిగా ఉప‌యోగించే జీల‌క‌ర్ర‌లో ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉన్నాయి.

అందుకే జీల‌క‌ర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.అయితే జీల‌క‌ర్ర ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ అతిగా తీసుకుంటే మాత్రం అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Effects Of Over Eating Cumin Seeds Cumin Seeds, Effects Of Cumin Seeds, Health

సాధార‌ణంగా జీల‌క‌ర్ర‌లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది.అందువ‌ల్ల‌, జీల‌క‌ర్ర క్ర‌మంగా మోతాదు మించి తీసుకుంటే.లివ‌ర్ డ్యామేజ్‌, కిడ్నీలో స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

Advertisement
Effects Of Over Eating Cumin Seeds! Cumin Seeds, Effects Of Cumin Seeds, Health

అలాగే గ‌ర్భ‌వ‌తులు ఆరోగ్యానికి మంచిది క‌దా అని అతిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుంటే చాలా డేంజ‌ర్ అంటున్నారు నిపుణులు.ఎందుకంటే, మోతాదుకు మించి జీల‌క‌ర్ర తీసుకోవ‌డం వ‌ల్ల‌ అబార్షన్ లేదా ప్రీమెచ్యుర్ ల్యాబర్ సమస్యలు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంద‌ట‌.

Effects Of Over Eating Cumin Seeds Cumin Seeds, Effects Of Cumin Seeds, Health

ఇక చాలా మంది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు జీల‌క‌ర్ర‌ను మోతాదు మించి తీసేసుకుంటుంటారు.కానీ, అతిగా జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, అధిక తేన్పులు, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.జీల‌క‌ర్ర‌ను మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి రోజు తీసుకుంటే.

బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.కానీ, అదే జీల‌క‌ర్ర‌ను మోతాదు మించి తీసుకుంటే.

షుగ‌ర్ లెవ‌ల్స్ బాగా డౌన్ అయిపోతాయి.దాంతో అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

కాబ‌ట్టి, ఆరోగ్యానికి మంచిది, ఎన్నో జ‌బ్బుల‌కు చెక్ పెడుతుంది అని చెప్పి జీల‌క‌ర్ర‌ను ఎప్పుడు కూడా అతిగా మాత్రం తీసుకోవ‌చ్చు.ఎందుకంటే, ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

Advertisement

అలా కాకుండా ఓవ‌ర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికే చేటు.ఇది జీల‌క‌ర్ర విష‌యంలోనూ వ‌ర్తిస్తుంది సో జీల‌క‌ర్ర‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకున్నా ప‌ర్వాలేదు.

కానీ, మితంగా మాత్ర‌మే తీసుకోండి.

తాజా వార్తలు