విద్యాధికారులే జిల్లాలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు..

సూర్యాపేట జిల్లా: జిల్లా( Suryapet District )లోని విద్యాశాఖ అధికారులే సూత్రధారులుగా విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని పేరెంట్స్, విద్యార్ది సంఘాల నేతలుగత కొంత కాలంగా అనేకనిరసన కార్యక్రమాలు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం కాగా,ప్రైవేట్, కార్పోరేట్ విద్యావ్యాపారం అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతుందని జిల్లాలో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్,కార్పోరేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి జిల్లా విద్యాధికారులు కంకణం కట్టుకొని,ప్రభుత్వ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని,ప్రభుత్వ విద్యా సంస్థల్లో సరైన సదుపాయాలు లేకుండా చేయడంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్ కోసం ప్రైవేట్, కార్పోరేట్ విద్యవైపు చూసేలా చేశారని,ఇదే అదునుగా జిల్లా విద్యాశాఖ నిబంధనలకు నీళ్ళు వదిలి,విచ్చలవిడిగా ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుమతులు ఇస్తూ "అందినకాడికి దోచుకో అందులో నా వాటా ఇచ్చుకో" అనే పద్ధతిలో వ్యవహరిస్తూ విద్యా వ్యాపారానికి పరోక్షంగా సంపూర్ణ మద్దతు తెలిపిందని,దీనితో ప్రైవేట్,కార్పోరేట్ విద్యా సంస్థలు( Private , corporate educational institutes ) ఇష్టారాజ్యంగా ఫీజులు,ఇతర స్టేషనరీ రూపంలో దోపిడీకి తెగబడ్డారని,ఎల్కేజీ నుంచే వేళల్లో ఫీజులు గుంజుతున్నా,పాఠశాలల్లోనే అధిక ధరలకు బుక్స్, స్టేషనరీ విక్రయాలు యధేచ్చగా సాగుతున్నా, తరగతిగది కెపాసిటీకి మించి విద్యార్థుల కుక్కుతున్నా,ఆటస్థలాలు లేకున్నా,అర్హతలేని ఉపాధ్యాయుల తీసుకున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని,అసలు ఆ స్కూళ్లల్లో ఏం జరుగుతుందో కూడా విద్యాశాఖ అధికారులకు తెలియదని,వాళ్లకు వాటాలు వెళితేచాలని, ఎంత దోపిడీ చేసినా అవసరం లేదని ఆరోపిస్తున్నారు.

విద్యార్థి సంఘాలు నెత్తినోరు బాదుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.ఇటీవల ఒక ప్రైవేట్ స్కూల్లో పుస్తకాల పంపిణీ జరుగుతుందని జిల్లా విద్యాధికారి అశోక్ బాబుకు తెలియపరచగా అక్కడికే వస్తున్నానని రాకపోవడంపైఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అడిషనల్ డిఈఓగా విధులు నిర్వహించే సూర్యాపేట ఎంఈఓ శైలజ తీరు మరో తంతు,జిల్లా కేంద్రం ఆమె ఆధీనంలో ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటని,పదుల సంఖ్యలో ప్రైవేట్ స్కూల్స్ ఉండటంతో ఏ ఒక్క స్కూల్ కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవని, పాఠశాలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు,హాస్టల్స్ అనుమతి లేకుండా నడుపుతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఫోన్ చేయగా ఏదైనా ఉంటే పాఠశాల వారితో మాట్లాడుకోండి దాంట్లో ఏముందని ఉచిత సలహా ఇవ్వడం కొసమెరుపు.జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగినా ఎవరూ పర్యవేక్షణ చేసేది లేదు,చర్యలు తీసుకున్నది లేదని,ఇప్పటికైనా

జిల్లా విద్యా శాఖ అధికారుల

తీరుపై జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలో జరుగుతున్న విద్యా వ్యాపార దోపిడీపై సమగ్ర విచారణ చేసి జరిపి, కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు,విద్యార్ది సంఘాలు కోరుతున్నారు.

మహిళ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Advertisement

Latest Suryapet News