కాలరాత్రి అవతార అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాలరాత్రి అవతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయం స్థానాచార్యులు అప్పాల బీమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి చతుషష్టి పూజలు నిర్వహించారు.

నాగిరెడ్డి మండపంలో గాయత్రి జపం, చండీ హోమం, గాయత్రి హవనాన్ని వేదమంత్రాలతో నిర్వహించారు.మూల నక్షత్రం సందర్భంగా పుస్తక రూపిని మహా సరస్వతి పూజ, అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి.

ఆలాగే, బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Latest Rajanna Sircilla News