రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ పరిధి అయిన సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎస్.
శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ.తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక.
బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ.
ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ.
తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండంట్లు రాందాసు, ఉదయ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమీల,ఆర్.
ఐ లు పి.నారాయణ , బి.శ్రీధర్, బి .శ్రీనివాస్ గారు, పి.శ్రీనివాస్ గారు సి.హెచ్ నేమాజీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.