ఆ రోడ్డుకు రావాలంటేనే జంకుతున్న డ్రైవర్లు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కేంద్రంలో కల్మల్ చెరువు రోడ్డు వాటర్ పైప్ లైన్ కోసం తీసిన గుంతలతో అస్తవ్యస్తంగా తయారై,ఆ రోడ్డుకు రావాలంటేనే వాహన డ్రైవర్లు జంకుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం వందలాది వాహనాలు తిరిగే రోడ్డుపై గుంతలు ఉండటంతో స్థానికులు, ఇతర గ్రామాలకు వెళ్ళే ప్రయాణికులు కనీసం ఆటోలు కూడా తిరిగే వీలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.

మండల కేంద్రంలో ఈ పరిస్థితి రోజూ అధికారులకు,ప్రజా ప్రతినిధులకు కనిపిస్తున్నా తమకేమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైన్ల కోసం తీసిన గుంతలు వెంటనే పూడ్చివేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

అల్లు అర్జున్ కాళ్ళ ముందు పడ్డ ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ భార్య.. ఏమైందటే?

Latest Suryapet News