డబుల్ ఇంజన్ ఇక్కడ వర్కౌట్ కాదు

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రం చైతన్యవంతమైన ప్రాంతమని,ఇక్కడి ప్రజలు కూడా చైతన్యవంతులని ఇక్కడ బీజేపీ డబుల్ ఇంజన్ వర్కౌట్ కాదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలో హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై ఆయన స్పందించారు.

ఇది బీజేపీ నేతలకు విజ్ఞానయాత్రని అన్నారు.ఇక్కడి అభివృద్ధి,పరిపాలన, సంక్షేమం తెలుసుకునేందుకు సువర్ణావకాశమని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వైపు చూస్తేనే వణుకు పుట్టి,హైదరాబాద్ కు బీజేపీ దండు పయనం కట్టారన్నారు.

Double Engine Is Not A Workout Here-డబుల్ ఇంజన్ ఇక్క

బీజేపీ వారిది వాపు కాదు బలుపు అని అన్నారు.దేశంలో డబుల్ ఇంజిన్ రోల్ అట్టర్ ప్లాప్ అయిందని,వైషమ్యాలు సృష్టించాడనికి,అంతరాలు పెంచడానికే డబుల్ ఇంజిన్లని ఎద్దేవా చేశారు.

అభివృద్ధి,సంక్షేమం,పరిపాలనలకు తెలంగాణా చిరునామా అని,ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రజలకు పెరిగిన విశ్వసనీయతను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని,విద్యుత్ రంగం గుజరాత్ లో దారుణంగా దిగజారిందన్నారు.వాట్సాప్ యూనివర్సిటీల మాయాజాలం ఇకపై పనిచేయదన్నారు.

Advertisement
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News