తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు వారసుగా ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈయన నటించిన ఈశ్వర్ సినిమా ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి కావడంతో ఈ విషయంపై కృష్ణంరాజు స్పందిస్తూ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతారని ఊహించలేదు అంటూ ఆయన సినీ కెరియర్ గురించి వెల్లడించారు.
ఇకపోతే ప్రభాస్ తన కెరియర్ గురించి ఎంతోమంది స్పందించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈయన సినీ కెరియర్ గురించి ప్రముఖ డైరెక్టర్ గీత కృష్ణ స్పందించారు.
ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న గీతాకృష్ణ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన సంచలన విషయాలను వెల్లడిస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ప్రభాస్ తనకు సినిమాలలోకి రాకముందే తెలుసని వెల్లడించారు.
కాకినాడలో ఉన్నప్పుడే ప్రభాస్ తనకు తెలుసని ప్రభాస్ చూడ్డానికి చాలా అందంగా ఉంటారని గీత కృష్ణ వెల్లడించారు.ఇక ప్రభాస్ కి సినిమాలలో నటించడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా తన పెదనాన్న తండ్రి బలవంతంతో ఇండస్ట్రీలోకి వచ్చారని గీతాకృష్ణ వెల్లడించారు.

ఇక చిన్నప్పుడు ప్రభాస్ పెద్దగా చదివేవారు కాదని, ఆయనకు సరిగా మాట్లాడటం కూడా రాదని ఈయన తెలిపారు.ఎప్పుడైతే రాజమౌళి చేతిలో బాహుబలి సినిమా చేశారో ఆ క్షణం ఈయన స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.ఒక్కసారిగా ప్రభాస్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఇక బాహుబలి సినిమా తర్వాత ఈయన నటించిన సాహో రాదే శ్యామ్ పెద్ద డిజాస్టర్ గా నిలిచాయి.ప్రభాస్ ఎంతో ఎత్తు పెరిగాడు కానీ ఆయనకు బుర్ర మాత్రం లేదు.సరైన కథలను ఎంపిక చేసుకోవడం ప్రభాస్ కు తెలియదు, అందుకే ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయని గీతాకృష్ణ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్.
మరి ఈయన చేసిన ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.