మట్టపల్లి గోశాలకు 2 ట్రక్కుల పశుగ్రాసం అందజేత

మఠంపల్లి మండలం మట్టపల్లి దేవస్థానంలోని రాజ్యలక్ష్మి గోశాల( Rajyalakshmi Goshala )లోని పశువులకు పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తున్న విషయం తెలుసుకొని నేరేడుచర్లకు చెందిన రైతులు నూకల శ్రీనివాస్ రెడ్డి,కొణతం వెంకట రెడ్డి సంయుక్తంగా 2 ట్రక్కుల పశుగ్రాసం(వరిగడ్డి)ని బుధవారం గోశాలకు అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోశాలలోని గోవులు పశుగ్రాసం లేక ఇబ్బంది పడుతున్నాయని తెలిసి దాదాపు 10 వేల రూపాయల విలువగల వరి గడ్డిని స్వయంగా తామే తమ ట్రాక్టర్లలో అన్ని ఖర్చులు భరించి తీసుకువెళ్లి గోశాలకు అప్పగించామన్నారు.

ఆకలితో అలమటించే మూగజీవాలకు గడ్డి( Grass ) అందించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు.ఎవరైనా పశుగ్రాసం( Grass Donation ) అందించే దాతలు ఉంటే వారి చుట్టుపక్కల మేత లేక ఇబ్బంది పడే గోశాలకు పశుగ్రాసం అందించాలని కోరారు.

Donation Of 2 Trucks Of Fodder To Mattapalli Goshala,Mattapalli Goshala,Fodder,G

Latest Suryapet News