శ్రీరామనవమి పండుగ( Sri Rama Navami )కు పది రోజుల ముందు నుంచే గ్రామాలలో వేడుకలు మొదలవుతాయి.తాటాకు పందిళ్లు వేసి దేవాలయాలను అందంగా అలంకరిస్తారు.
చైత్రమాసం 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తేదీన జరుపుకుంటారు.
ఇంట్లో శ్రీరామనవమి పూజా( Sri Ram Navami Puja) విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
అలాగే అభ్యంగన స్నానం చేయాలి.ఇంటిముందు అందమైన రంగవల్లులు వెయ్యాలి.
ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి.కొత్త దుస్తులు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.

శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్టించాలి.రామ దర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.సీతారాములను క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది.జాతకంలోనికి గ్రహదోషాలు తొలగిపోతాయి.పూజ గదిలో సీతారాముల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు.ఇంటికి తూర్పు దిశలోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
ఇది ప్రతిష్టించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.

ప్రతిరోజు రామ్ దర్భార్ ను పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది.సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుంది.శ్రీరామ నవమి రోజు రామ్ దర్భార్ పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.
అలాగే బియ్యం పిండి( Rice flour )తో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి.పట్టు వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను ఉంచాలి.
సీత శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.ఆ తర్వాత షోడాపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి.
ధూప దీపాలు నైవేద్యాలుగా సమర్పించాలి.తర్వాత రామచరిత మానస్, సుందరకాండ వంటివి పారాయణం చేస్తే మీకు రాముల వారి అనుగ్రహం లభిస్తుంది.
నైవేద్యంగా వడపప్పు, పానకం సమర్పిస్తారు.పూజ ముగిసిన తర్వాత పేదవారికి పండ్లు, విసనకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.