ప్రపంచాన్ని ఎదిరిస్తున్న పుతిన్ పుట్టుక.. ఎంత విచిత్రమో తెలుసా?

వ్లాదిమిర్ పుతిన్.ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 Do You Know About Putin Birth Secret , Putin, Vladimir Puti, Putin Birth Secret,-TeluguStop.com

ఈ పేరు గురించి అందరు చర్చించుకుంటున్నారు.ప్రస్తుతం ఉక్రెయిన్ పై ఎడతెరిపి లేకుండా దాడి చేస్తున్న సమయంలో ప్రపంచ దేశాలు హెచ్చరికలు జారీ చేస్తున్నా లెక్క చేయని ధైర్యం ఆయన సొంత.

ప్రపంచ దేశాలు మొత్తం ఒక వైపు ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకవైపు అనేలాగే మారిపోయింది ప్రస్తుత పరిస్థితి.ఇంతకీ ఈ వ్లాదిమీర్ పుతిన్ ఎవరు.

అతను ఎలా నియంత స్థాయికి ఎలా ఎదిగాడు.ప్రస్తుతం ప్రపంచాన్ని ఎదిరించే స్థాయికి ఎదిగాడు అన్న విషయాలను ప్రస్తుతం ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇలాంటి వెతుకులాటలో పుతిన్ జననం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.ఎందుకంటే సినిమాలో కొన్ని సన్నివేశాలను చూస్తూ ఇది నిజ జీవితంలో అసాధ్యం అని అనుకుంటూ ఉంటాము.

పుతిన్ జీవితంలో మాత్రం ఇలా అసాధ్యమనుకున్న ఘటన సుసాధ్యం అయింది.ఊహించని రీతిలో పుతిన్ పుట్టుక జరిగింది.ప్రపంచాన్ని ఎదిరించి నిలబడుతున్న పుతిన్ జననానికి ముందే మరణంకూడా భయపడి వెనక్కి తగ్గింది అని తెలుస్తోంది.ఇంతకీ కమ్యూనిస్టు నాయకుడిని అని చెప్పుకునే నియంత పుతిన్ పుట్టుక ఎలా జరిగింది అంటే.

అనగనగా అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం.రెండో ప్రపంచ యుద్ధం ఎంతో హోరాహోరీ జరుగుతుంది.ఆ సమయంలోనే రష్యా సైనికుడూ కాస్త విరామం తీసుకుని భార్య ని కలవడానికి వెళ్లాడూ.ఆ సమయంలో దారిలో కుప్పలు కుప్పలుగా మృతదేహాలు.

వ్యాన్ లో ఎక్కిస్తున్నారు.చూస్తే మనసు మొత్తం భాగంగా మారిపోయింది బాధ పడుతూనే అటు వైపు అడుగులు వేసాడు.

అంతలో ఒక మహిళ పాదం అతనికి తాకింది.అయితే అక్కడ అలా పడి ఉన్న మహిళ తన భార్య అనే విషయం గుర్తు పట్టడానికి ఎంతో సమయం పట్టలేదు.

ఇక ఉన్న శవాలను వ్యాన్ లోకి ఎక్కిస్తున్న వ్యక్తి తో గొడవపడి మరి తన భార్య శవాన్ని ఇంటికి తీసుకెళ్లాడు.కానీ ఆమెకు ఇంకా ఊపిరి ఆడుతుందన్న విషయాన్ని గ్రహించి వైద్యం అందించాడు.

చివరికి ఆమె కోలుకుంది.ఎనిమిదేళ్ల తర్వాత ఆమెకు ఒక మగ బిడ్డ పుట్టాడు.

అతనే మనం మాట్లాడుకుంటున్న పుతిన్.

Telugu Putin Secret, Jawan, Putin, Russia, Ukraine, Vladimir Puti-Telugu Stop Ex

ఇలా పుట్టింది జననం ఎంతో విచిత్రంగా జరిగింది అని చెప్పాలి.జవాన్ స్మశాన వాటికకు వెళ్లడం ఎంటి.ఒక మహిళను అదే క్షణంలో భార్య అని గుర్తించడం ఏంటి.

తర్వాత భర్త తీసుకెళ్ళాక ఆమె బ్రతకడం ఏంటి.బ్రతికిన కొన్నాళ్ళకి ఒక మగ బిడ్డకు జన్మనివ్వటం ఏంటి.

ఇలా మరణాన్ని జయించి వచ్చిన బిడ్డ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉండడం ఏంటి.అంతా విచిత్రంగా ఉంది కదూ.ఈ విషయం గురించి తెల్సి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube