సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించ వద్దు: కోట గోపి

సూర్యాపేట జిల్లా: ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించవద్దని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి అన్నారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మె తొమ్మిదవ రోజుకు చేరుకున్న సందర్భంగా సమ్మె శిబిరం వద్దకు చేరుకొని కార్మికులకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో అనునిత్యం వీధులన్ని పరిశుభ్రం చేస్తూ పలు విధాలుగా చాకీరి చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినేంట్ చేయకుండా కాలయాపన చేస్తూ వారి జీవితాలతో ఆటలాడుకోవడం సరైంది కాదన్నారు.జివో 60 ప్రకారం పెంచిన జీతాలను అమలు చేయాలని,మల్టీ పరపస్ విధానంతో సిబ్బంది పని చేయలేక పోతున్నారని వాపోయారు.

Do Not Call Off Strike Till Issues Are Resolved Kota Gopi, Kota Gopi, Kvps, Pan

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన గ్రామ పంచాయతీ కార్మికుల పోరాటానికి ప్రభుత్వం దిగిరాకపొతే ప్రజలు పాలకవర్గాన్ని ప్రతిఘటిస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్, గ్రామపంచాయతీ కార్మికుల అధ్యక్షులు చెమట నాగరాజు, షేక్ సుభాని,కంభంపాటి మధు సూదన్,పుట్ట శ్రీకాంత్, తిరపయ్య,అనిల్,వెంకన్న, గురవయ్య,నాగభూషణం, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు
Advertisement

Latest Suryapet News