ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ, భద్రతపై పోలీసు నోడల్ అధికారులతో,ట్రైనీ ఐపిఎస్ అధికారితో కలిసి సీఐ,ఎస్ఐలతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలు,అక్రమ రవాణా అడ్డుకోవడం,స్వాధీన వివరాలు,క్షేత్ర స్థాయిలో నిఘా,రూట్ మొబైల్స్ మార్గాల్లో భద్రత చర్యలు, చెక్ పోస్ట్ లలో తనిఖీలు, జిల్లాలో ఆకస్మిక రైడ్ లు, పాత నేరస్తులపై చర్యలు, ట్రబుల్ మాంగార్స్ బైండోవర్స్,ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు,కేంద్ర బలగాల నిర్వహణ,సిబ్బంది కేటాయింపులు మొదలగు అంశాలపై సమీక్షించి అధికారులకు సలహాలు, సూచనలు అందించారు.

పోలీస్ నోడల్ అధికారులు నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లలో లోపం తలెత్తకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అను పకడ్బందీగా అమలు చేయడం,ఎన్నికలకు, ఎన్నికల సామాగ్రికి, ఓటర్లకు భద్రత కల్పించడం ముఖ్యమని, ఎన్నికల విధుల్లో నీయమితులైన అన్ని స్థాయిల అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు.

సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసుకునెలా ఉండాలని,అన్ని పోలింగ్ కేంద్రాలు,రూట్ మొబైల్ మార్గాల్లో స్థితిగతులపై నిశితమైన అవగాహన కలిగి ఉండాలని,స్థానికత కలిగిన సిబ్బందిని పోలింగ్ బూత్ ల వద్ద,స్ట్రైకింగ్ ఫోర్స్ నందు విధులకు కేటాయించవద్దన్నారు.ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సాధారణ విధులు,ఫిర్యాదులపై కూడా దృష్టి సారించాలని అన్నారు.

నిర్మానుష్య ప్రాంతాలు,శివారు ప్రాంతాల్లో నిఘా ఉంచాలి అన్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో ఎల్లప్పుడూ పర్యటిస్తూ ఎన్నికల నియమావళిపై,ఎన్నికల భద్రత,కేసుల నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Advertisement

ఎన్నికల సమీపిస్తన్న వేళ ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే స్పందించేలా సిబ్బందిని సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి అవసరమైన రక్షణ అంశాలను సవరించుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు,లైటింగ్ ఏర్పాట్లు చెక్ చేసుకోవాలని,ఇతర రాష్ట్రాల నుండి వచ్చే హోమ్ గార్డ్స్,పోలీస్, పారామిలిటరీ కేంద్ర బలగాలను సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు.చెక్ పోస్ట్ ల నందు పటిష్టంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని,మండల, పట్టణ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలు, నాఖా బందీ కార్యక్రమాలతో ప్రజలతో మమేకమై ఉండాలాన్నారు.

అక్రమ రవాణా,ఓటర్లను ప్రభావితం చేయడం, బహుమతులు పంచడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం,సోషల్ మీడియా మానిటరింగ్, డబ్బుల పంపిణీ,మద్యం, డ్రగ్స్ వాటిపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు.నేరాలకు పాల్పడే,మోడల్ కోడ్ ఉల్లంఘనలు పాల్పడితే కేసులు నమోదు చేసి నివేదిక అందించాలని ఆదేశించారు.

ప్రజలు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, అనుమతులు లేకుండా సభలు,సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దని కోరారు.ఎన్నికల సమయంలో తగాదాలు పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు తప్పవని ప్రజలు గ్రహించాలన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, శనివారం 2024
58,59 జీవోలు ఉల్లఘించి 90 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా

ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల్లో అందరూ వారి ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని కోరారు.ఇప్పటి వరకు 4 కోట్ల 54 లక్షల విలువ గల నగదు,ఇతరములు సీజ్ చేశామని,ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో మరో 1 కోటి 13 లక్షల విలువ సీజ్ చేశారన్నారు.

Advertisement

ఇందులో 2 కోట్ల 26 లక్షలు నగదు 10 లక్షల 65 వేల విలువగల మద్యం,1 కోటి 17 లక్షల విలువ ఆభరణాలు,1 కోటి విలువ గల ఎలక్ట్రానిక్ వస్తువులు,వస్త్రాలు ఇతరములు సీజ్ చేశామన్నారు.ఈ సమావేశం నందు హుజూర్ నగర్ నోడల్ అధికారి అదనపు ఎస్పి నాగేశ్వర రావు, సూర్యాపేట నోడల్ అధికారి డిఎస్పీ రవి, కోదాడ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి,ట్రైనీ ఐపియస్ అధికారి రాజేష్ మీనా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు,సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, రజిత రెడ్డి,రాము, రామకృష్ణారెడ్డి,రఘువీర్ రెడ్డి,సురేందర్ రెడ్డి, ఎలక్షన్ సెల్ ఎస్ఐ విష్ణుమూర్తి,మండలాల ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.

Latest Suryapet News