గ్రామ ప్రజావాణిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

నల్గొండ జిల్లా:మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో గురువారం జరిగిన గ్రామ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై.

శేఖర్ రెడ్డి అకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామపంచాయతీ, అంగన్వాడి కేంద్రంలో పలుకు రికార్డులను పరిశీలించారు.పారిశుద్ధ్యం,అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.

నర్సరీ,బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని, అంగన్వాడి సెంటర్, సెగ్రిగేషన్ షెడ్డు,స్మశాన వాటిక నిర్వహణను పరిశీలించారు.వర్షకాలం గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సందర్భంగా ప్రజలు డెంగ్యూ,మలేరియా, కలరా వంటి వ్యాధుల బారిన పడకుండా అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్న మున్నయ్య,ఎంపీఓ రవి కుమార్,ఏఈ వెంకటేశ్వర్లు,ఈసీ,టెక్నికల్ అసిస్టెంట్స్,పంచాయితీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
నల్లగొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం : ఎస్పీ

Latest Nalgonda News