హెలిప్యాడ్,సభ స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

జిల్లాలో ఈ నెల 24 న సీఎం కేసీఆర్( CM KCR ) పర్యటన ఉన్న నేపథ్యంలో సభా స్థలం,హెలిప్యాడ్ లాండింగ్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ లతో కలసి కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్ గురువారం సాయంత్రం పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని నూతన కలెక్టరేట్,ఎస్పీ ఆఫీస్, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ భవనాలు రాష్ట్ర ముఖ్య మంత్రిచే ప్రారంభ కార్యక్రమాలు ఉన్నందున పట్టణంలోని పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్,జిల్లా అధికారులను ఆదేశించారు.స్థానిక ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న కొత్త మార్కెట్ యార్డ్ కు వెళ్లే రోడ్డు పక్కన సభా స్థలాన్ని,అలాగే హెలిఫ్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని ప్రాథమికంగా పరిశీలించారు.

District Collector S. Venkatarao Inspected The Helipad And Meeting Place , S. V

ఆయా స్థల యజమానులతో భూములకు సంబంధించి వివరాలు సేకరించి చర్చలు జరపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో ఆర్డీవో రాజేంద్ర కుమార్( RDO Rajendra Kumar ), డిఎస్పీలు నాగభూషణం, రవి,ఈఈ ఆర్ అండ్ బి యాకుబ్,విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ
Advertisement

Latest Suryapet News