కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

నల్లగొండ జిల్లా:ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతూ శ్రీశైలం డ్యామ్ కు వరద పోటెత్తింది.

గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో నిండు కుండను తలపిస్తోంది.

దీనితో సోమవారం సాయంత్రం ఏపీ ఇరిగేషన్ శాఖ కర్నూలు చీఫ్ ఇంజినీర్ కబీర్ భాషా శ్రీశైలం ప్రాజెక్టు మూడు(ఆరు,ఏడు, ఎనిమిదో నంబర్) గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 81 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణమ్మ ఒక్కో గేటు నుంచి 27 క్యూసెక్కుల చొప్పున మొత్తం 81 క్యూసెక్కుల నీరు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.ప్రస్తుతం నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం: 590 అడుగులు,ప్రస్తుత నీటి మట్టం:511.70 అడుగులు,పూర్తి స్థాయి నీటినిల్వ:312.5050 టిఎంసిలు,ప్రస్తుత నీటి నిల్వ: 134.5749 టిఎంసిలు,కుడి కాలువ: 5882.క్యూసెక్కులు ఎడమ కాలువ:నిల్, మెయిన్ పవర్ హౌస్: నిల్,ఎస్ఎల్బీసి 800 క్యూసెక్కులు,క్రస్ట్ గేట్స్: నిల్,ఇన్ ఫ్లో:1,44 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో: 54,376 లక్షల క్యూసెక్కులుగా ఉంది.శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీటిమట్టం 878.40 అడుగులకు చేరింది.జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.ఇక శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు అయితే నీటి నిల్వ సామర్థ్యం కూడా జులై 29వ తేదీ నాటికి 179.89 టీఎంసీలకు చేరింది.శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల సమాచారం మేరకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యం 215.8070 టిఎంసీలకు గాను, సోమవారం ఉదయం 10 గంటలకు 177.1490 టీఎంసీలకు చేరుకుంది.ఇదే సమాయనికి పైనుండి ప్రాజెక్టుకు 4,37,680 క్యూసెక్కుల నీరు వస్తున్నది.

రిజర్వాయర్ 30 వ,తేదీ ఎప్పుడైనా పూర్తిస్థాయికి చేరుకుంటుంది.దీనిని దృష్టిలో ఉంచుకొని సోమవారమే శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు శ్రీశైలం ప్రాజక్ట్ రేడియేల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి.తెలిపారు.

అందువల్ల నల్గొండ జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా నాగర్జున సాగర్ ప్రాజక్ట్ తిరుగు జలాలు నిలిచే ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలతో పాటు,నది పరివాక ప్రాంత ప్రజలెవ్వరూ ఈత కోసం, బట్టలు ఉతికేందుకు నదిలోకి వెళ్ళవద్దని, అలాగే మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్ళకూడదని, పశువులను సైతం నదిలోకి తీసుకెళ్లడం,నది దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

Advertisement

నది పరివాహక ప్రాంత మండలాల,గ్రామాల అధికారులందరినీ ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తం చేయాలని,ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని,ఈ విషయమై సంబంధిత గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఆరోగ్యానికి వరం చుక్కకూర.. వారానికి ఒక్కసారి తిన్న లాభాలే లాభాలు!
Advertisement

Latest Nalgonda News