వికలాంగులకు సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ

సూర్యాపేట జిల్లా: కలెక్టరెట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని క్రిపుల్డ్ దివ్యాంగులకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో బ్రింగ్ ఎ స్మైల్ ఫౌండేషన్ సహాయంతో 28 వీల్ చైర్స్ పంపిణి చేశారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్బగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఉన్న సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని అన్నారు.తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ మాట్లాడుతూ దివ్యాంగులకు వీల్ చైర్స్ అందించటమే కాదు రాబోయే రోజుల్లో కూడా వారికీ సహాయంగా వుంటామన్నారు.

Distribution Of Wheelchairs To The Disabled Under The Aegis Of Social Impact Gro

దివ్యాంగులు వీల్ చైర్స్ లేక నడవలేని స్థితిలో ఉన్న వారికీ చాలా సహాయంగా ఉపయోగపడే వీల్ చైర్స్ ని అందించటం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు.జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ టి-ఎస్ఐజి డైరెక్టర్ అర్చన సురేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే.నరసింహరావు,ఏఓ సుదర్శన్ రెడ్డి,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News