ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ( Pension Distribution ) జరగనుంది.ఈ మేరకు రేపటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు మరియు అనారోగ్యంతో బాధపడే వారికి ఇంటి వద్దే పెన్షన్ ను అందించాలని ఏపీ ప్రభుత్వం( AP Government ) నిర్ణయం తీసుకుంది.
గ్రామ సచివాలయాలకు దూరంగా ఉన్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.అయితే సరిపడా సిబ్బంది లేకపోవడంతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా పెన్షన్ల పంపిణీ సమయంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పని చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.