కోతకొచ్చిన పంట కోసం రైతుల కష్టాలు

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ట్యాంకర్ల నీటికి 50 వేల రూపాయలు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన కంట్టే రెడ్డి రైతు ట్యాంకర్లతో తన పొలానికి నీళ్లు పట్టే దుస్థితి ఏర్పడింది.బోర్లు బావులు ఉన్న నీరు అడుగంటడంతో వరి పొట్ట దశకు రావడంతో పంటను కాపాడడం కొరకు ట్యాంకర్లతో నీటిని పొలానికి అందిస్తున్నారు.

 The Hardships Of The Farmers For The Harvested Crop , Harvested Crop , Hardship-TeluguStop.com

ఇప్పటివరకు దాదాపు 20 ట్యాంకర్లను నీటిని అందించామని ఒక్కొక్క ట్యాంకర్ కు 600 రూపాయల చొప్పున చెల్లించామని పూర్తిగా కోతకు వచ్చేసరికి ఇంకా 30 ట్యాంకర్ల నీరు అవసరం పడుతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.తను వేసిన నాలుగు ఎకరాల పొలాన్ని కాపాడడం కొరకు పెట్టిన పెట్టుబడి పొందడం కొరకు మాత్రమే దాదాపుగా నలభై నుండి 50 వేల రూపాయలు ఖర్చు చేసి వరికి నీళ్లు అందిస్తున్నామని తన గోడు వెలుబుచ్చుకున్నాడు.

ఫిబ్రవరి మార్చిలో కాలువల ద్వారా నీటిని అందిస్తే భూగర్భ జలాలు పెరిగి కొంతవరకు వరి పొలాలకు ఉపశమనం ఉండెదని అన్నాడు.ఇంత చేసినప్పటికీ కోతకు వచ్చేసరికి వడగళ్ల వానలు పడినట్టు అయితే రైతుల బాధ వర్ణనాతీతం అని అన్నాడు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube