కోతకొచ్చిన పంట కోసం రైతుల కష్టాలు
TeluguStop.com
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ట్యాంకర్ల నీటికి 50 వేల రూపాయలు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన కంట్టే రెడ్డి రైతు ట్యాంకర్లతో తన పొలానికి నీళ్లు పట్టే దుస్థితి ఏర్పడింది.
బోర్లు బావులు ఉన్న నీరు అడుగంటడంతో వరి పొట్ట దశకు రావడంతో పంటను కాపాడడం కొరకు ట్యాంకర్లతో నీటిని పొలానికి అందిస్తున్నారు.
ఇప్పటివరకు దాదాపు 20 ట్యాంకర్లను నీటిని అందించామని ఒక్కొక్క ట్యాంకర్ కు 600 రూపాయల చొప్పున చెల్లించామని పూర్తిగా కోతకు వచ్చేసరికి ఇంకా 30 ట్యాంకర్ల నీరు అవసరం పడుతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
తను వేసిన నాలుగు ఎకరాల పొలాన్ని కాపాడడం కొరకు పెట్టిన పెట్టుబడి పొందడం కొరకు మాత్రమే దాదాపుగా నలభై నుండి 50 వేల రూపాయలు ఖర్చు చేసి వరికి నీళ్లు అందిస్తున్నామని తన గోడు వెలుబుచ్చుకున్నాడు.
ఫిబ్రవరి మార్చిలో కాలువల ద్వారా నీటిని అందిస్తే భూగర్భ జలాలు పెరిగి కొంతవరకు వరి పొలాలకు ఉపశమనం ఉండెదని అన్నాడు.
ఇంత చేసినప్పటికీ కోతకు వచ్చేసరికి వడగళ్ల వానలు పడినట్టు అయితే రైతుల బాధ వర్ణనాతీతం అని అన్నాడు.
వైరల్ వీడియో: పందెకోసం తయారు చేసిన కోడి చివరకు ఎక్కడికి చేరిందంటే?