Shankar : అపరిచితుడు సినిమా వల్ల దర్శకుడు శంకర్ ఎంత అవమానం పొందాడో తెలుసా ?

దర్శకుడు శంకర్( Shankar ) ప్రతిభ గురించి ఎవరు అంచనా వేయాల్సిన అవసరం లేదు.అతడు ఒక గొప్ప క్రియేటర్.

విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో తనను మించిన వారు మన ఇండియాలోనే లేరు.అంతటి దర్శకుడు అయినటువంటి శంకర్ కి కూడా పరాభవాలు తప్పలేదు.

అతడు ఒక కాపీ క్యాటర్ అంటూ ఎంతో మంది నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి.అది అపరిచితుడు లాంటి ఒక గొప్ప సినిమా విషయంలో జరగడం ఒకింత బాధాకరం.

అపరిచితుడు సినిమా అంటే తమిళంలో అన్నియన్( Anniyan ).ఈ సినిమా తీయడానికి గల కారణం తన ఇంటికి వచ్చిన న్యూస్ పేపర్ లోని ఒక వార్త.ఒక పోలీస్ ఆఫీసర్ ని క్రిమినల్ నీ పట్టుకోవడం కోసం 40 రోజుల పాటు గుడి ముందు భిక్షాటన చేసి చివరికి ఆ క్రిమినల్ ని అరెస్ట్ చేయడంతో ఆ వార్త పేపర్ లో వచ్చింది.

Advertisement
Director Shankar About Aparichithudu Movie-Shankar : అపరిచితు�

దాంతో శంకర్ దాన్ని సినిమా తీయాలనుకున్నాడు మొదట.

Director Shankar About Aparichithudu Movie

ఆ తర్వాత సినిమా సినిమాకి మధ్యలో ఎప్పుడు విదేశాలకు వెళ్లి రావడం శంకర్ కి ఉన్న అలవాటు.ఆ క్రమంలో విదేశాల్లో ఉన్న అలవాట్లు ఒక్కసారిగా ఇండియాకి రాగానే ఇక్కడివారు పాటించే బద్ధకం, నిర్లక్ష్యం వంటి వాటిని శంకర్ జీవించుకోలేకపోయేవాడు.అందుకే ఇండియాలోని మురికి వాడల్లో అతడు కొన్ని రోజుల పాటు తిరిగి మనవాల్లలో ఉన్న బద్దకం, నిర్లక్ష్యం వల్ల జరిగే అత్యంత ఘోరమైన ప్రభావాల గురించి ఒక సినిమా తీయాలనుకున్నాడు.

అలాగే ఈ సినిమా గురించి అన్వేషణ చేస్తున్న సమయంలోనే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ పరిచయమయ్యాడు.కేవలం బద్ధకం, నిర్లక్ష్యం అనే చిన్న చిన్న కారణాల వల్ల జరిగే పెద్ద పెద్ద ప్రమాదాల గురించి గరుడ పురాణంలో కొన్ని శిక్షలు ఉన్నాయ్ అంటూ ఆ ప్రొఫెసర్ చెప్పిన మాటలకి శంకరి ఎంతో ఆకర్షణకు గురయ్యాడు.

Director Shankar About Aparichithudu Movie

ఇలా పోలీస్ ఆఫీసర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు ప్రొఫెసర్ చెప్పిన మాటలను కలిపి తన ఆస్థాన రచయిత సుజాత( Sujata ) గారికి అప్పగించడంతో ఆయన అపరిచితుడు సినిమా కథను రాశారు.ఈ సినిమా సెవెన్ అనే ఒక హాలీవుడ్ సినిమాలు పోలి ఉంది అంటూ పలు రకాల విమర్శలు శంకర్ పై వచ్చాయి.ఎంతో మంది ఇది సెవెన్ సినిమాను కాపీ కొట్టి తీశారు అంటూ ఆయన్ను విమర్శించారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

కానీ ఆయన స్వయంగా కల్పించుకుని తాను స్వయంగా అనుభవించిన కొన్ని విషయాలను మాత్రమే సినిమాగా తీశానని, తను ఏ సినిమాను కాపీ కొట్టలేదని, అలా అనుకుంటే గరుడ పురాణం ఎప్పుడో వచ్చిందని, సెవెన్ సినిమాలో బైబిల్ ని ఆధారంగా చేసుకుని శిక్షలు వేస్తారని, ప్రతి దేశానికి వారికంటూ కొన్ని ప్రముఖ గ్రంథాలు ఉంటాయని అంత మాత్రాన కాపీ కొట్టాను అంటే ఊరుకోను అంటూ శంకర్ సమాధానం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు