దిల్ రాజు వెనకడుగు అందుకేనట!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను నిర్మిస్తూ వాటిని రిలీజ్ చేసే పనిలో పడ్డాడు.

ఇప్పటికే ఈ జాబితాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ కూడా ఉంది.

ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో నాని చేయబోయే పాత్రపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Dil Raju Not Interested For OTT Release, Dil Raju, V Movie, OTT Release, Tollywo

దీనికి కారణం ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర పోస్టర్స్, టీజర్ చూస్తే తెలుస్తోంది.ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఇప్పటికే రిలీజ్ చేయాలని భావించిన చిత్ర యూనిట్‌కు లాక్‌డౌన్ రూపంలో పెద్ద అడ్డంకి వచ్చి పడింది.

కాగా ఈ లాక్‌డౌన్ కారణంగా ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునే పరిస్థితి కూడా కనబడటం లేదు.దీంతో పలువురు ఫిల్మ్ మేకర్స్, తమ చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫాంలపై రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

ఈ క్రమంలో దిల్ రాజు కూడా ‘వి’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ ఆయనకు భారీ ఆఫర్లు వచ్చి పడ్డాయి.కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు తన చేతిలోనే ఉండటం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా థియేటర్ యాజమాన్యాల మనుగడ ఇబ్బందికరంగా మారడంతో మళ్లీ వారికి మంచి రోజులు రావాలంటే థియేట్రికల్ రిలీజ్‌లు జోరుగా చేయాలని ఆయన భావిస్తున్నాడు.

దీంతో ‘వి’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలో రిలీజ్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు.కానీ థియేటర్లు రిలీజ్ అయ్యాక ముందులా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారనే క్లారిటీ మాత్రం లేదు.

ఓటీటీ ఇచ్చిన భారీ ఆఫర్‌ను కాదని థియేటర్లకే మొగ్గు చూపేందుకే దిల్ రాజు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.మరి ‘వి’ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఓదెల 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
Advertisement

తాజా వార్తలు