దేవుళ్లకు చలి పెడుతుందని స్వెటర్లు, శాలువాలు కప్పిన భక్తులు.. ఎక్కడంటే..

ప్రస్తుతాన్ని ఇండియాలో చలికాలం నడుస్తోంది.గత కొద్దిరోజులుగా భారతదేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలకు దారుణంగా పడిపోతున్నాయి.

 Devotees Covered With Sweaters And Shawls To Keep The Gods From Getting Cold,-TeluguStop.com

ఈ చలికి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు.ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలలో ఇంటికే పరిమితం అవుతున్నారు.

చలి రాక్షసి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది స్వెటర్లు ధరిస్తున్నారు.మరికొందరు బయటికి రావాల్సి వస్తే దుప్పట్లు, శాలువాలు కప్పుకొని తిరుగుతున్నారు.

మనుషులైతే ఈ జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నారు కానీ దేవుళ్లకు చలి నుంచి రక్షణ ఎలా లభిస్తుంది అనే ఆలోచన తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్‌ ( Bhopal )నగరవాసులకు వచ్చింది అంతే వారు తాము ఎంతో ఇష్టంతో కొలిచే దేవుళ్ళ విగ్రహాలకు స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలు కప్పారు.

సంకట మోచన హనుమాన్ టెంపుల్‌( Hanuman temple )లో దేవుళ్లకు స్వెటర్లు, శాలువాలు కప్పిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారాయి.శీతాకాలంలో చల్లటి గాలి నుంచి దేవుళ్లను రక్షించడానికే ఇలాంటి దుస్తులతో విగ్రహాలను అలంకరిస్తున్నామని భక్తులు తెలియజేశారు.ఈ విషయం తెలిసి మరింత మంది భక్తులు కానుకలుగా స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలను చేస్తున్నారు.

వాటిని దేవాలయ పూజారులు దేవుళ్ల విగ్రహాలకు అలంకరించారు.తెలుగులో కూడా ఆలయాలు ఎంతో అందంగా కనిపించాయి.

ఈ వీడియోను ప్రముఖ వార్తా సంస్థ ఎన్ఎన్ఐ సోషల్ మీడియాలో పంచుకుంది.ఆ క్లిప్‌లో ఆంజనేయ స్వామి, వినాయకుడు, పరమేశ్వరుడు, ఇతర దేవుళ్లకు స్వెటర్లు, శాలువాలు తొడగడం మనం చూడవచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.మీరు కూడా దీనిపై ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube