ఆరుకు చేరిన మోతె ప్రమాద మృతుల సంఖ్య

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey ) కేంద్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం( Road accident )లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.

ప్రమాద సమయంలో ముగ్గురు, హాస్పిటల్ చికిత్స పొందుతూ మరో ఇద్దరితో కలిపి మొత్తం ఐదుగురు నిరుపేద కూలీలు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

తీవ్ర గాయాలైన మునగాల మండలం( Munagala ( రేపాల గ్రామానికి చెందిన సోమపంగు లక్ష్మి (32) శుక్రవారం హైదాబాద్ గాంధీ( Gandhi Hospital )లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest Suryapet News