గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే తెలిపారు.

గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతు జిల్లాకు ఆంధ్ర సరిహద్దు ఉండటంతో గంజాయి అక్రమ రవాణా జరిగే అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు.

దీంతో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి అక్రమ రవాణా నివారించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.నిఘా పెరగటం,కేసులు నమోదు చేస్తుండటంతో కొంతమేరకు ఇటీవల గంజాయి ఛాయలు తగ్గినట్లు తెలిపారు.

Crackdown On Ganja Smuggling District SP Rahul Hegde, Ganja Smuggling, Suryapet

జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలను గుర్తించి ట్రాఫిక్ నియంత్రణకోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు,మండల కేంద్రాల్లో,చిన్న గ్రామాల నుంచి ఇటివల హైవేలు పెరిగాయని,దీంతో అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు.కొత్తగా హైవేలు నిర్మించిన ప్రాంతాల్లోని మండల కేంద్రాలు,గ్రామాలలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించి వాటిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు,హైవేల పక్కన ఉన్న ప్లాట్ ఫామ్ పై ఎలాంటి నిర్మాణాలు లేకుండా ప్రజలు,వ్యాపారస్తులు సహకరించాలన్నారు.

ఆర్టిసి బస్టాండ్లు ఉండి అక్కడ బస్సులు నిలిపే అవకాశం ఉన్న వాటిని గుర్తించి బస్సులను అక్కడ నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులను కోరనున్నట్లు తెలిపారు.ప్రయాణికులకు నిలిచేందుకు ఇబ్బందులు లేని వద్ద బస్సులు ఆపేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Advertisement

ఇటీవల అక్కడక్కడ దొంగతనాలు జరుగుతున్నాయని, వాటిని నిరోధించేందుకు రాత్రిపూట పెట్రోలింగ్ పెంచనున్నట్లు తెలిపారు.రాత్రిపూట గస్తీ తిరిగే మోటారు సైకిల్కు సైరన్లు ఉండేవిధంగా చూస్తామని, గ్రామాల్లో అపరిచిత.

వ్యక్తులు,కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ప్రజలు అందించాలని కోరారు.ప్రతి గ్రామంలో,మండల కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయటంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

సిసి కెమెరాలు లేనిచోట,పనిచేయని చోట కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు స్థానిక పోలీసు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.పోలీసులు పటిష్టంగా పనిచేయాలంటే ప్రజల సహకారం ఉండాలని,ప్రతివిషయంలో ప్రజల సహకారంతో ముందుకెళ్తామని,లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.

సమావేశంలో హుజుర్ నగర్ సిఐ చరమందరాజు,గరిడేపల్లి, నేరేడుచర్ల ఎస్ఐలు ఈట సైదులు,రవీందర్ నాయక్, ఏఎస్ఐ రాములు నాయక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News