ఇంటింటికి సిపిఐ ప్రచార యాత్ర...!

నల్లగొండ జిల్లా: జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలని,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా డిండి లిఫ్ట్ ను పూర్తిచేసి దేవరకొండ నియోజకవర్గానికి సాగునీరు అందించాలని, ఏప్రిల్ 16 నుండి మే 3 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఇంటింటికి సిపిఐ పేరుతో ప్రచార యాత్ర నిర్వహిస్తుంది.

అందులో భాగంగా బుధవారం చింతపల్లి మండలంలోని పీకే మల్లెపల్లి,ఎం.

మల్లెపల్లి, సాయిరెడ్డిగూడెం,విరాట్ నగర్,కుర్మేడు,గొల్లపల్లి, ఉమ్మాపురం,తక్కల్లపల్లి, రోటిగడ్డ తండా,చాకలి శేరుపల్లి,మదనాపురం, పోలేపల్లి,గోడకొండ్ల గ్రామాలు పర్యటిస్తూ ప్రజలను చైతన్య పరిచారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి,మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు,గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్,సిపిఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి,ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ,వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎండి మైనొద్దీన్,చింతపల్లి సిపిఐ మండల కార్యదర్శి పోలే వెంకటయ్య,సహాయ కార్యదర్శిలు ఆరెకంటి రాధాకృష్ణ,పల్లపు లక్ష్మయ్య, ప్రజానాట్యమండలి కళాకారుడు గణేష్, ఏఐటియుసి నాయకులు శేఖరాచారి పాల్గొన్నారు.

CPI Door-to-door Campaign Nalgonda District, CPI Door-to-door Campaign, Nalgonda
మూసికి పూడిక ముప్పు

Latest Nalgonda News