సర్కారు బడుల్లో కార్పొరేట్‌ విద్య: ఎమ్మెల్యే బొల్లం...!

సూర్యాపేట జిల్లా:సర్కారు బడుల్లో కార్పొరేట్‌ స్థాయి విద్య అందుతుందని,మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలు మారాయని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్( Bollam mallaiah yadav ) అన్నారు.

శనివారం మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యాబోధన,వసతులు కల్పించేందుకు మన ఊరు-మనబడి( Mana ooru - Mana badi ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ మీ పిల్లలను సర్కారు బడుల్లో చేర్చాలని,ఉన్నత చదువులు చదివిన క్వాలిఫైడ్ టీచర్స్ చే సర్కారు బడుల్లో విద్యాబోధన జరుగుతున్నదని,సర్కారు బడుల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతుందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు.

ఉచితంగా ఆంగ్ల విద్యతో పాటు ఉచిత పుస్తకాలు,దుస్తులు ఈ ఏడాది కొత్తగా నోటు పుస్తకాలు కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు.తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో( Government schools ) విద్యార్థులను చేర్పించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎండి.సలీం షరీఫ్,పాఠశాల హెడ్ మాస్టర్ రాజు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News